కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ది ఇండియా స్టోరీ' విడుదలకు సిద్ధమైంది. జూలై 24న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. రైతులు పండించే పంటలకు వినియోగించే రసాయన ఎరువుల నేపథ్యంలో చేతన్ డీకే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పడే కీలక పాత్ర పోషించగా, చిన్నారి పాత్రలో త్రిష శారద నటించింది. మురళీ శర్మ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో, ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.
'ది ఇండియా స్టోరీ` ట్రైలర్ రిలీజ్
18 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 09:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)