శనివారం, 19 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'ధురంధర్'​ను వెనక్కినెట్టిన మరాఠీ చిత్రం

12 గంటల క్రితం

nasa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 01:56 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- 2027 ఆస్కార్‌ అవార్డుల బరిలో 'గోంధల్'

న్యూఢిల్లీ : మైనార్టీల పట్ల విద్వేషం వెళ్లగక్కుతూ తెరకెక్కించిన ‘ధురంధర్‌’కు ఆస్కార్‌ నామినేషన్ల సమయంలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ చిత్రాన్ని వెనక్కి నెట్టి మరాఠీ సినిమా 'గోంధల్' భారత్‌లోని ఆస్కార్‌ బరిలో నిలిచింది. సంతోష్‌ ధవాఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కించిన 'గోంధల్' ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ఆస్కార్‌ అధికారిక ఎంట్రీ దక్కించుకుందని భారత చలనచిత్ర సమాఖ్య (ఎఫ్‌ఎఫ్‌ఐ)కు చెందిన ఆస్కార్‌ ఎంట్రీల ఎంపిక కమిటీ ఛైర్మన్‌ పి శేషాద్రి శుక్రవారం నాడు తెలిపారు. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో 33 సినిమాలు ఆస్కార్ ఎంట్రీలో పోటీలో ఉండగా, కమిటీ ‘గోంధల్‌’ను ఎంపిక చేసింది. పోటీ పడిన చిత్రాలలో ధురంధర్ పార్ట్​ 1, బార్డర్ 2, మై వాపస్ ఆవుంగా వంటివి ఉన్నాయి. ఆ చిత్రాలను అన్నిటినీ వెనక్కి నెట్టి.. సహజసిద్ధమైన శైలితో, గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన గోంధల్​ను కమిటీ ఎంపిక చేసి నామినేషన్స్​కు పంపించింది.

మరాఠీ నుంచి నాలుగో సినిమాగా..

దీంతో మరాఠీ భాష నుంచి ఆస్కార్ పోటీలకు ఎంపికైన నాలుగో సినిమాగా గోంధల్ ఘనత దక్కించుకుంది. గతంలో మరాఠీ భాషలో తెరకెక్కిన కోర్టు (2015), హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ (2009), శ్వాస్ (2005) సినిమాలు ఆస్కార్​లో అధికారిక ఎంట్రీ దక్కించుకున్నాయి. కానీ వీటికి అవార్డు రాలేదు. ఇక గతేడాది నీరజ్ దర్శకత్వంలో వచ్చిన హొంబౌండ్ సినిమా భారత్ నుంచి ఆస్కార్​ పోటీకి ఎంపికైంది. కానీ ఈ చిత్రానికి తుది నామినేషన్స్​లో చోటు దక్కలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్