హైదరాబాద్ : ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేశారు. శ్రీనివాసరావు ఇక లేరనే వార్త ఎంతో బాధాకలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి లాంటి గొప్ప చిత్రాలు తీశారని గుర్తుచేశారు. కాలానికి ముందే ఆలోచించి సినిమాలు తీశారని ప్రస్తావించారు. తరాలు మారినా కొత్తగా అనిపించే సినిమాలు అందించిన దార్శనికుడని కొనియాడారు. సింగీతం శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
‘సింగీతం ఇక లేరనే వార్త ఎంతో బాధాకరం’: జూనియర్ ఎన్టీఆర్
58 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 09:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)