ఇండోనేషియాలో ఆదివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:07 గంటలకు ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు భారత భూకంప అధ్యయన కేంద్రం (NCS) వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. భూకంప ప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం లేదు. భూకంపం కారణంగా సునామీ ముప్పు కూడా లేదని అధికారులు స్పష్టం చేశారు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఇండోనేషియాలో 5.2 తీవ్రతతో భూకంపం
43 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 04, 2026, 10:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)