నాని హీరోగా నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ట్రైలర్ విడుదల చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ట్రైలర్ కోసం అభిమానులు ఎదురుచూస్తుండగా, శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో నాని ఈ విషయాన్ని వెల్లడించారు. ట్రైలర్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, సంగీత దర్శకుడు అనిరుధ్ మరో నాలుగైదు రోజులు పనిచేయాల్సి ఉంటుందని, సినిమా విడుదలకు సమయం తక్కువగా ఉండటంతో నాణ్యత విషయంలో రాజీపడకుండా సినిమాకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇప్పటికే ‘ఏష నాగుల’, ‘ఆయారే’ పాటలు, టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. సమావేశంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చెరుకూరి పాల్గొన్నారు.
‘ది ప్యారడైజ్’ ట్రైలర్ లేదు : నాని
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 08:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)