శనివారం, 01 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

‘సీక్రెట్ సోల్జర్‌’గా టైటిల్ మార్పు

7 గంటల క్రితం

moviesw
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 01, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న స్పై థ్రిల్లర్‌కు ‘సీక్రెట్ సోల్జర్‌’ అనే కొత్త టైటిల్‌ను ఖరారు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇప్పటివరకు ఈ చిత్రం ‘చైనా పీస్’ పేరుతో ప్రచారంలో ఉంది. అక్కి విశ్వనాథ రెడ్డి దర్శకత్వంలో మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) ‘U/A 16+’ సర్టిఫికెట్ జారీ చేసింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హర్షిత బండ్కమూరి కథానాయికగా నటిస్తుండగా, కమల్ కామరాజు, తులసి, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్