మంగళవారం, 13 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition‘ఉడ్తా తీర్‌’ ట్రైలర్‌ విడుదల

2 గంటల క్రితం

‘ఉడ్తా తీర్‌’ ట్రైలర్‌ విడుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 13, 2026, 07:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా, సారా అలీ ఖాన్‌ జంటగా నటిస్తున్న యాక్షన్‌ కామెడీ చిత్రం ‘ఉడ్తా తీర్‌’. ఆకాష్‌ ఎ. కౌశిక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్‌ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్‌ పాకిస్థాన్‌ ఏజెంట్‌గా కనిపించనున్నారు. ఓ రహస్య మిషన్‌లో భాగంగా భారత్‌కు వచ్చిన ఆయన అనుకోని ప్రమాదం కారణంగా జ్ఞాపకశక్తిని కోల్పోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తిని రేకెత్తించేలా ట్రైలర్‌ సాగింది. కరణ్‌ జోహార్‌కు చెందిన ధర్మ ప్రొడక్షన్స్‌, గునీత్‌ మోంగా స్థాపించిన సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్