హీరో నిఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం 'స్వయంభు`. ఈ చిత్రంలో హీరోయిన్లుగా సంయుక్త, నభా నటేష్ నటిస్తున్నారు. శుక్రవారం సంయుక్త పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసింది. ఈ వీడియోలో సంయుక్త కత్తి పట్టుకుని, గుర్రపు స్వారీలు చేస్తూ కనిపిస్తోంది. దీన్నిబట్టి ఆమె ఓ వీరనారి పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మాణం జరుగుతోంది.
'స్వయంభు`లో సంయుక్త
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 06:50 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)