విలక్షణ నటుడు ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ‘జాంబిరెడ్డి-2’ చిత్రయూనిట్ ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ఉపేంద్ర చెట్టుకు తలకిందులుగా వేలాడుతూ కనిపించారు. ప్రపంచాన్ని తలకిందులు చేసేందుకు రియల్ స్టార్ సిద్ధమవుతున్నారంటూ మేకర్స్ పోస్టర్ ద్వారా తెలిపారు. వెండితెరపై ఎన్నడూ చూడని విధంగా ఉపేంద్ర ఈ చిత్రంలో సరికొత్త, వైవిధ్యమైన మాస్ అవతార్‌లో కనిపించబోతున్నట్లు చిత్రయూనిట్ వెల్లడించింది. ఆయన పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలిపింది. సుపర్ణ ఎస్. వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మరోసారి ప్రేక్షకులను భయపెట్టేలా రూపొందుతోంది. ఇందులో తేజ సజ్జా కథానాయకుడిగా నటిస్తున్నారు.
భయపెట్టేలా ఉపేంద్ర
18 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 18, 2026, 08:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)