కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ట్రైన్’ విడుదల తేదీ ఖరారైంది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి కొత్త పోస్టర్‌తో పాటు విడుదల తేదీని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిస్కిన్ దర్శకత్వం వహించడమే కాకుండా సంగీతం కూడా అందిస్తున్నారు. శ్రుతి హాసన్, నాజర్, దివ్వ శర్మ, జయరామ్, వినయ్ రాయ్, నరైన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 13, 2026, 08:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)