శనివారం, 26 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘రాజీ పడకుండా నిర్మించాం’

7 గంటల క్రితం

‘రాజీ పడకుండా నిర్మించాం’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 26, 2026, 07:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఫహద్‌ ఫాసిల్‌ నటించిన ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ అక్టోబర్‌ 2న విడుదల కానుంది. శశాంక్‌ ఏలెటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఎస్‌.ఎస్‌. కార్తికేయ, శోభు యార్లగడ్డ నిర్మించారు. సినిమాను నిర్మించడంలో ఎదురైన సవాళ్లను నిర్మాతలు మీడియాతో పంచుకున్నారు. ‘‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వంటి చిత్రాలతో పోలిస్తే ఇది చిన్న సినిమా. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు మాకు ఎంతో కీలకమైంది. ప్రతిరోజూ ఒక సెటప్‌తో దాదాపు 79 లొకేషన్లలో షూటింగ్‌ చేశాం. నాణ్యతను కాపాడుకుంటూనే బడ్జెట్‌కు లోబడి సినిమాను నిర్మించడం సవాల్‌గా అనిపించింది’’ అని నిర్మాతలు తెలిపారు. 2021లో ఈ సినిమా కథ విన్నానని కార్తికేయ చెప్పారు. 2025 అక్టోబర్‌లో షూటింగ్‌ ప్రారంభించడానికి ముందు ప్రాజెక్టును సిద్ధం చేసేందుకు చిత్రబృందం చాలా సమయం వెచ్చించిందన్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరుకు షూటింగ్‌ పూర్తయిందని, ఆ తర్వాత దాదాపు ఆరు నెలల పాటు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరిగాయని తెలిపారు. ‘‘కథ ఏ సమయంలో విడుదల చేసినా ఇబ్బంది ఉండదు. సినిమా ఆలస్యమైనా దాని ప్రభావం కథపై ఉండదు. ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది’’ అని నిర్మాతలు అన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్