గురువారం, 24 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జనవరి 21న ‘లవ్ అండ్ వార్’

8 గంటల క్రితం

జనవరి 21న ‘లవ్ అండ్ వార్’ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 24, 2026, 06:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ అండ్ వార్’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో రణబీర్ కపూర్ చేతికి గాయమైనప్పటికీ కారు నడుపుతున్నట్లు కనిపించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రంలో అలియా భట్‌ యాక్షన్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు చిత్రబృందం తెలిపింది. బన్సాలీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్