నాని కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్లడీ రోమియో’లో ఆయన చెఫ్, గ్యాంగ్‌స్టర్ పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాని పాత్రల కోసం లుక్ టెస్ట్ నిర్వహించగా, దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దసరా సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 16, 17 తేదీల్లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేయాలని, ఇందులో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్, యునానిమస్ ప్రొడక్షన్స్ పతాకాలపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
నాని ద్విపాత్రాభినయంతో...
7 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 10, 2026, 08:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)