శనివారం, 15 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇమామ్‌లు, మౌజన్ల గౌరవ వేతనాలకు రూ.22.50 కోట్లు

2 గంటల క్రితం

imam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 15, 2026, 09:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ఇమామ్‌లు, మౌజన్ల గౌరవ వేతనాల చెల్లింపునకు కూటమి ప్రభుత్వం రూ.22.50 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఎపి వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ హర్షం వ్యక్తం చేశారు.2026,27 ఆర్థిక సంవత్సరానికి ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలలకు గౌరవ వేతనాలు చెల్లించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మంజూరైన నిధులను ఎపి రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సిఇఒకు విడుదల చేయాలని మైనారిటీ సంక్షేమ ఆయనశాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించిందని పేర్కొన్నారు. ఇమామ్‌లు, మౌజన్లకు గౌరవ వేతనాల చెల్లింపునకు నిధులు మంజూరు చేయడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ఇమామ్‌లు, మౌజన్లకు క్రమం తప్పకుండా గౌరవ వేతనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందనీయమని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలోని ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందుతోందని పేర్కొన్నారు. మంజూరైన నిధులను త్వరితగతిన ఇమామ్‌లు, మౌజన్లకు అందేలా చర్యలు తీసుకుంటామని అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు. మంత్రిలు నారా లోకేష్‌, ఎన్‌ఎండి ఫరూక్‌ సహకారంతో మైనారిటీల సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మైనారిటీల సంక్షేమం పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్