న్యూయార్క్: ప్రపంచ చరిత్రలోనే అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడి జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 సెప్టెంబర్ 11న అల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాపై జరిపిన భీకర దాడులు ఆ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆ రోజు ఉదయం ఉగ్రవాదులు హైజాక్ చేసిన విమానాలు న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ (డబ్ల్యూటీసీ) జంట టవర్లను బలంగా ఢీకొట్టాయి. ఉదయం 8:46 గంటలకు మొదటి విమానం నార్త్ టవర్‌ను, 9:03 గంటలకు రెండో విమానం సౌత్ టవర్‌ను ఢీకొనడంతో క్షణాల్లోనే ఆ భవనాలు కుప్పకూలి అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. అనంతరం ఉదయం 9:37 గంటలకు మూడో విమానం వాషింగ్టన్ డిసి సమీపంలోని పెంటగన్ భవనాన్ని ఢీకొట్టింది. కాగా, నాలుగో విమానం (యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93)లో ప్రయాణికులు ఉగ్రవాదులను అడ్డుకోవడంతో అది పెన్సిల్వేనియాలోని ఒక ఖాళీ ప్రదేశంలో కూలిపోయి, పెద్ద ప్రమాదం తప్పింది. ఈ వరుస దాడుల్లో దాదాపు 3,000 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. సుమారు వెయ్యి మంది మృతదేహాలను ఇప్పటికీ గుర్తించకపోవడం గమనార్హం.
అమెరికాను వణికించిన భీకర దాడికి 25 ఏళ్లు
1 రోజు క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 01:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)