శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

యుకె కొత్త ప్రధానిగా ఆండీ బర్న్‌ ‌హామ్‌!

1 గంట క్రితం

uk pm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 01:09 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- లేబర్‌ ‌పార్టీ నేతగా ఎన్నిక

లండన్‌ : బ్రిటన్ అధికార లేబర్ పార్టీ కొత్త నేతగా ఆండీ బర్న్‌ హామ్ శుక్రవారం ఖరారయ్యారు. లండన్‌లో జరిగిన ప్రత్యేక పార్టీ సదస్సులో లేబర్ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఎన్‌ఇసి) చైర్‌పర్సన్ షబానా మహమూద్ ఈ ప్రకటన చేశారు. వచ్చే వారం బర్న్‌ ‌హామ్‌ ‌ప్రధానిగా భాద్యతలు చేపట్టనున్నారు. గ్రేటర్ మాంచెస్టర్ మాజీ మేయరైన బర్న్‌ హామ్‌కు హౌస్ ఆఫ్ కామన్స్‌లోని 403 మంది లేబర్ చట్టసభ్యుల్లో 379 మంది మద్దతు లభించడంతో ఆయన ఏకైక అభ్యర్థిగా నిలిచారు. ప్రస్తుత ప్రధాని కియర్ స్టార్మర్‌ స్థానంలో బర్న్‌హామ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సోమవారం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కింగ్ చార్లెస్- III బర్న్‌హామ్‌ను ఆహ్వానించనున్నారు. లేబర్‌ ‌పార్టీ నేతగా ఎన్నికైన అనంతరం బర్న్ హామ్‌ ‌మాట్లాడుతూ ప్రజల ఆశలను మళ్లీ పునరుద్దరిస్తానన్నారు. రాజకీయ అస్తిరతను, ఆర్థిక నమూనాను మారుస్తానన్నారు. వెనకబడిన ప్రాంతాల ప్రజల అసంతృప్తిని తగ్గించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అధికార వికేంద్రికరణ ద్వారా అసమానతలు తొలగిస్తానని చెప్పుకొచ్చారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్