బీజింగ్ : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఏడేళ్ల విరామం తర్వాత భారత్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 12, 13తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు చైనా విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు జిన్‌పింగ్ భారత్‌కు వస్తున్నట్లు తెలిపింది. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ -జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరిగే అవకాశం ఉంది. జిన్‌పింగ్ చివరిసారిగా2019అక్టోబర్‌లో భారత్ వచ్చారు.అప్పట్లో చెన్నై సమీపంలోని మహాబలిపురంలో ప్రధాని మోడీతోఅనధికారిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు.
జిన్‌పింగ్‌తో పాటు చైనా పొలిట్‌బ్యూరో సభ్యుడు,విదేశాంగ మంత్రి వాంగ్ యి,వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావో సహా ప్రతినిధి బృందం భారత్‌కు రానుంది.చైనా వాణిజ్య మంత్రి వాంగ్ వెంటావో భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది.








కామెంట్‌లు (0)