బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చైనా గణిత శాస్త్రవేత్తలకు అత్యున్నత ప్రపంచ పురస్కారం

4 రోజుల క్రితం

china
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 25, 2026, 11:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

బీజింగ్‌ : చైనాకు చెందిన ఇద్దరు విద్యావేత్తలు గణితశాస్త్రంలో తొలిసారిగా ప్రపంచ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. చైనా గణిత శాస్త్రవేత్తలు హాంగ్‌ వాంగ్‌, యు డెంగ్‌తో పాటు అమెరికాకు చెందిన జాన్‌ పార్డన్‌, కెనడాకు చెందిన జాసన్‌ సిమెర్మాన్‌ కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరు పదివేల ఐదు వందల డాలర్ల చొప్పున నగదు బహుమతి అందుకున్నారు. శతాబ్దానికి పైగా గణిత శాస్త్రవేత్తలను తికమక పెడుతున్న సమస్యలను పరిష్కరించినందుకు చైనీయులు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. అమెరికా, ఫ్రాన్స్‌లలో విద్యాబోధన చేస్తున్న వాంగ్‌ (35) ఈ గౌరవాన్ని అందుకున్న మూడో మహిళగా నిలిచారు. కృత్రిమ మేధ (ఏఐ) విసురుతున్న సవాళ్లు రోజురోజూ పెరుగుతున్న నేపథ్యంలో గణితశాస్త్రంలో నోబెల్‌కు సమానమైనదిగా భావించే ఫీల్డ్‌ మెడల్స్‌ను గురువారం అమెరికాలో వీరికి ప్రదానం చేశారు. కాగా చైనా సామాజిక మాధ్యమాలలో శాస్త్రవేత్తల ప్రతిభను ప్రశంసిస్తూ పోస్టులు వెలువడుతున్నాయి. వీబో నుంచి రెడ్‌నోట్‌ వరకూ వివిధ సోషల్‌ మీడియా వేదికలలో ఈ పోస్టులను లక్షలాదిగా తిలకిస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్