బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅమెరికా అప్పుల కుప్పపై ఆందోళన

1 గంట క్రితం

G--america.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 12:11 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : అమెరికా అప్పులకుప్పగా మారుతోంది. తొలిసారిగా 40 ట్రిలియన్‌ డాలర్లను దాటడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఈ స్థాయి అప్పు తక్షణ చెల్లింపు సంక్షోభాన్ని సూచించకపోయినా.. పెరుగుతున్న వడ్డీరేట్లు, భారీ బడ్జెట్‌ లోటు, నిరంతరం పెరుగుతున్న రుణ అవసరాలు అమెరికా బాండ్‌ మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఆగస్టు 18 నాటికి ప్రజల చేతిలో ఉన్న అమెరికా అప్పు సుమారు 32.3 ట్రిలియన్‌ డాలర్లు కాగా, ప్రభుత్వ అంతర్గత ట్రస్ట్‌ ఫండ్లకు చెందిన అప్పు సుమారు 7.8 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. దీర్ఘకాలిక అమెరికా ట్రెజరీ బాండ్లపై పెట్టుబడిదారులు అధిక రాబడిని డిమాండ్‌ చేస్తున్నారు. 30 ఏళ్ల ట్రెజరీ బాండ్‌ రాబడి దాదాపు 20 ఏళ్ల గరిష్ఠానికి చేరి 5.3 శాతాన్ని దాటింది. 10 ఏళ్ల బాండ్‌ రాబడి కూడా 4.7 శాతం చుట్టూ కొనసాగుతోంది. పెరుగుతున్న దీర్ఘకాలిక రాబడులను కొంత నియంత్రించేందుకు ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెస్సెంట్‌ దీర్ఘకాలిక బాండ్ల కొనుగోలు కార్యక్రమాన్ని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ చర్య ద్వారా మార్కెట్‌లో ద్రవ్యలభ్యత పెంచి, బాండ్‌ ధరలు పడిపోకుండా, రాబడులు మరింత పెరగకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్