- 40 మంది సైనికులు సహా 90 మంది మృతి
ఏడెన్(యెమెన్) : యెమన్ పశ్చిమ సరిహద్దుల్లో గురువారం నుండి కొనసాగుతున్న భీకర పోరులో మొత్తం 90మంది మరణించారని వైద్య అధికారులు శుక్రవారం మీడియాకు తెలిపారు. వీరిల్ 40మంది ప్రభుత్వ సైనికులు కాగా, 50మంది హౌతి కార్యకర్తలని తెలిపారు. హౌతీలు శుక్రవారం తెల్లవారు జామున పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారని ఈ దాడుల్లో 14మంది సైనికులు మరణించారని హొదెదై ప్రావిన్స్ వైద్య అధికారులు వెల్లడించారు. పొరుగున గల తైజ్ ప్రావిన్స్‌లో గురువారం నుండి కొనసాగుతున్న దాడుల్లో 26మంది సైనికులు మరణించారని మరో వైద్యాధికారి తెలిపారు. ఇదిలావుండగా, హొదెదైలోని పలు ఆస్పత్రులకు 50వరకు హౌతి కార్యకరతల మృతదేహాలు వచ్చాయని హౌతి అదుపులోని ప్రాంతాల మెడికల్ వర్గాలు తెలిపాయి. ఇరుపక్షాలు మరింత మంది బలగాలను, సాయుధవాహనాలను, పరికరాలను పంపడంతో శుక్రవారం ఈ పోరు మరింత ఉధృతమైందని మిలటరీ వర్గాలు తెలిపాయి. సానా నగరం, ఉత్తర యెమెన్‌లో పలుభాగాలను హౌతీలు స్వాధీనం చేసుకోవడంతో 2014 నుండి యెమెన్‌లో తీవ్ర స్థాయిలో సాయుధ పోరు, ఘర్షణలు కొనసాగుతున్నాయి.








కామెంట్‌లు (0)