మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజాంబియా అధ్యక్షుడిగా హిచిలెమా ఘన విజయం

1 గంట క్రితం

Zambia's President.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 11:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లుసాకా (జాంబియా) : జాంబియా అధ్యక్షుడిగా మితవాది హకైండె హిచిలెమా తిరిగి ఎన్నికయ్యారు. పది లక్షలకు పైగా ఓట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు. అయితే ఎన్నిక జరిగిన తీరు పట్ల ప్రతిపక్షం తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. దేశ రాజకీయ దిశా నిర్దేశంపై ప్రశ్నలు సంధిస్తోంది. ఈ ఎన్నికల్లో హిచిలెమాకు 29,65,326 ఓట్లు రాగా, ప్రత్యర్ధి ముండుబిలెకు 18,56,217ఓట్లు వచ్చాయని ఎన్నికల కమిషన్‌ ‌ప్రకటించింది. 2021లో అధికారంలోకి వచ్చిన హిచిలెమా తాజా విజయంతో మరో ఐదేళ్లు పదవిలో కొనసాగనున్నారు. రుణ భారంతో బలహీనమైన ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తామని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరిస్తామని, ఆఫ్రికాలో రెండో అతిపెద్ద రాగి ఉత్పత్తి దేశంగా పురోగతిని సాధిస్తామని వాగ్దానాలు చేసి హిచిలెమా అధికారంలోకి వచ్చారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్