మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఅడ్డొస్తే మీపైనా బాంబులేస్తాం!

1 రోజు క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 18, 2026, 12:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఒమన్‌ను హెచ్చరించిన ట్రంప్‌

  • ఇరాన్‌ తెల్లజెండా చూపాలంటూ వ్యాఖ్యలు

  • 200కి పైగా శత్రు విమానాలను కూల్చివేసామన్న ఇరాన్‌

వాషింగ్టన్‌ : అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్‌ ‌జలసంధిని తిరిగి తెరిపించే ప్రయత్నాలకు అడ్డు వస్తే బాంబులు వేస్తామంటూ ఒమన్‌‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌హెచ్చరించారు. ఫాక్స్‌ ‌న్యూస్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ బెదిరింపులు చేశారు. ఇరాన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలను కలిగి వుండరాదన్న తన వైఖరిని మరోసారి పునరుద్ఘాటించారు. ఎన్నటికీ అణు బాంబును సమకూర్చుకోరాదని తేల్చి చెప్పారు. ఇదే తమ ప్రధమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏ రూపంలోనూ, ఏ రకంగానూ, అణ్వాయుధాన్ని కలిగివుండే పరిస్థితే లేదన్నారు. ఈ మేరకు ట్రూత్‌ ‌సోషల్‌లో పోస్టు పెట్టారు.

ఇరాన్‌ ‌లొంగిపోవాల్సిందే..

ఇరాన్‌ ‌తామే లొంగిపోయామంటూ ‌తెల్లజెండా చూపాలన్నారు. ఐఆర్‌‌జిసితో నేరుగా అక్రమంగా తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ యుద్ధాన్ని తక్షణమే ఆపాలనే ఒత్తిడేదీ తమకు లేదని స్పష్టం చేశారు. తనకు తొందరేమీ లేదని, ఎలాంటి టైమ్‌ ‌షెడ్యూల్‌‌కూడా లేదని చెప్పారు.

శత్రు విమానాలను ధ్వంసంచేశాం : ఇరాన్‌

యుద్ధం ఆరంభమైనప్పటినుండి ఇప్పటివరకు 200కి పైగా శత్రు విమానాలను కూల్చివేసినట్లు ఐఆర్‌‌జిసి ప్రకటించింది. ఇరాన్‌‌ను అంతర్గతంగా దెబ్బతీయాలని తమ శత్రువులు వ్యూహాలు పన్నుతున్నారని కానీ అవి ఎన్నటికీ నెరవేరవని ఐఆర్‌‌జిసి డిప్యూటీ కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌ ‌మేజర్‌‌ జనరల్‌ ముస్తఫా ఇజాది స్పష్టం చేశారు. ఇది హైబ్రీడ్‌ ‌యుద్ధమని వ్యాఖ్యానించారు. ఈ యుద్ధం వల్ల ఇరాన్‌ ‌రాజకీయ వ్యవస్థ బలహీనపడిందని, లేదా దేశం ముక్కలైందన్న వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ఇస్లామిక్‌ ‌వ్యవస్థ ముక్కలవలేదని,గతంలోకన్నా మరింత బలంగా తయారైందన్నారు. ప్రాంతీయ సవాళ్ళను పరిష్కరించడానికి, శాంతి సుస్థిరతలను పెంపొందించడానికి చర్చలు, దౌత్యమొక్కటే మార్గమని పాక్‌, టర్కీ విదేశాంగ మంత్రులు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఇటీవల నెలకొన్న పరిణామాలను ఇరువరు మంత్రులు ఫోన్‌‌కాల్‌‌లో చర్చించారు. పరస్పరం ఆందోళన కలిగిస్తున్న అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

ఇరాన్‌ను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చేందుకు సహకరించం : దక్షిణ కొరియా

ఇరాన్‌ను అణ్వస్త్ర రహిత దేశంగా మార్చేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలకు సహకరించాల్సిందిగా అమెరికా చేసిన అభ్యర్థనను దక్షిణ కొరియా తోసిపుచ్చింది. దీంతో సియోల్‌తో సంయుక్త సైనిక విన్యాసాలను తగ్గించుకోవాలని పెంటగాన్‌ను దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశించారు. ఈ విషయాలను ట్రంప్‌ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ చేశారు. ఇరాన్‌ వద్ద అణ్వస్త్రాలు లేకుండా చేయాలన్న తన ప్రయత్నాలకు సహకరిస్తారా అని ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడిని అడిగానని, అందుకు ఆయన 'నో' చెప్పారని ట్రంప్‌ ఆ పోస్టులో వివరించారు. దక్షిణ కొరియాతో సంయుక్తంగా చేపట్టే సైనిక విన్యాసాలను పూర్తిగా రద్దు చేసుకునేందుకు ఇప్పుడు సమయం లేనందున ఆ వార్షిక విన్యాసాలను కుదించుకోవాలని రక్షణ కార్యాలయాన్ని ఆదేశించానని తెలిపారు. కాగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఘర్షణలు, టెహ్రాన్‌ అణు కార్యక్రమంపై ఒత్తిడి కోసం భాగస్వాములను సమీకరించేందుకు వాషింగ్టన్‌ చేస్తున్న ప్రయత్నాల నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్