మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమాపై దాడి చేస్తే గల్ఫ్‌ దేశాలపై భీకర దాడులే!

06 ఆగస్టు, 2026

IranWar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 11:57 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • హెచ్చరించిన ఇరాన్‌

  • సైనికచర్యను నిలువరించాలంటూ ట్రంప్‌‌కు సౌదీ అభ్యర్థన

టెహ్రాన్‌, వాషింగ్టన్‌ : అమెరికా తమపై తాజాగా దాడులు జరిపితే తాము తీవ్రంగా ప్రతీకార దాడులకు పాల్పడుతామని, గల్ఫ్‌ ‌దేశాలపై భీకర దాడులు తప్పవని ఇరాన్‌ ‌హెచ్చరించింది. గల్ఫ్‌ ‌ప్రాంతం వ్యాప్తంగా కీలకమైన ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తామని చెప్పింది. ఈ హెచ్చరిక ప్రతి ఒక్క గల్ఫ్‌ ‌దేశానికీ ఉద్దేశించిందని పేర్కొంది. అమెరికాకు అత్యంత సన్నిహితమైన ప్రాంతీయ మిత్రదేశాలపై, అలాగే ఆమెరికా ఆస్తులపై దాడులు చేయడం ద్వారా అమెరికా సైనిక చర్యల వ్యయాన్ని పెంచాలని ఇరాన్‌ ‌భావిస్తోంది. ఇరాన్‌ ఇంధన నెట్‌‌వర్క్‌‌లపై, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామంటూ గతనెల 28న ట్రంప్‌ బెదిరించిన తర్వాత ఇరుపక్షాల మధ్య ఉన్నత స్థాయిలో దౌత్య సంప్రదింపులు జరిగాయి. ఆ నేపథ్యంలోనే తాజా హెచ్చరికలు వెలువడ్డాయి. ఇరాన్‌ ‌విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరగ్చి సౌదీ, టర్కీ, కతార్‌ ‌విదేశాంగ మంత్రులతో మాట్లాడారు. అలాగే పాకిస్తాన్‌ ఆర్మీ చీఫ్‌‌తో కూడా మాట్లాడారు. ఈ అంశం సున్నితత్వం కారణంగా ఎవరూ బయటకు ఈ చర్చల వివరాలను వెల్లడించలేదు. కానీ ఆ చర్చల గురించి తెలిసిన ఇద్దరు సీనియర్‌ ఇరాన్‌ అధికారులు, గల్ఫ్‌ ‌వర్గాలు, సీనియర్‌ ‌ప్రాంతీయ దౌత్యవేత్త ఒకరు పై వివరాలు వెల్లడించారు.

ఇరాన్‌‌పై అమెరికా దాడులు జరపకుండా చూసుకో వాల్సిన బాధ్యత గల్ఫ్‌ ‌దేశాలదేనని అరగ్చి స్పష్టం చేశారు. ఆ మేరకు ట్రంప్‌‌ను ఒప్పించే విషయం చూసుకోవాలన్నారు. ఇరాన్‌‌పై ఏ రకమైన దాడి జరిగినా అమెరికా ఆస్తులపై, గల్ఫ్‌‌లోని ఇంధన సదుపాయాలపై దాడులు జరపక తప్పదని అరగ్చి హెచ్చరించారు. ఇప్పటివరకు ఏ సమావేశం, చర్చలు జరిగినా అరగ్చి తమ వైఖరిని స్పష్టం చేస్తూనే వచ్చారు. ‘‘తీవ్రంగా ప్రతిస్పందించడానికి మేం సిద్ధంగా వున్నాం. అయితే పశ్చిమాసియావ్యాప్తంగా ఉద్రిక్తతలు పెచ్చరిల్లడం, విధ్వంసం చోటు చేసుకోవడాన్ని నివారించాలంటే దౌత్యపరమైన పరిష్కారమే అత్యంత ఉత్తమమైన మార్గమని’’ కూడా ఆయన పునరుద్ఘాటించారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌‌తో సౌదీ యువరాజు ఫోన్‌‌లో మాట్లాడారు. సైనికచర్యలను నిలుపుచేసి, చర్చల పంథాను అనుసరించాలని కోరారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుని తద్వారా దౌత్య పరిష్కారానికి సిద్ధం కావాలని ట్రంప్‌‌ను కోరినట్లు గల్ఫ్‌‌ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా సౌదీ అరేబియా, కతార్‌‌లకు ఈ హెచ్చరికలు జారీ చేసినా అన్ని గల్ఫ్‌ ‌దేశాలకూ ఇది వర్తిస్తుంది. మరోవైపు టెహ్రాన్‌‌తో చర్చలు పునరుద్ధరించా లంటూ కతార్‌, ఒమన్‌, సౌదీ అరేబియాలు ట్రంప్‌‌ను కోరాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్