గురువారం, 23 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రజావసరాలను పక్కనబెట్టి.. బాంబులకే బిలియన్లా!

2 గంటల క్రితం

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 23, 2026, 08:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- ట్రంప్ యుద్ధ వ్యయంపై డెమోక్రాట్ల మండిపాటు

వాషింగ్టన్: ఇరాన్‌పై సైనిక చర్యలకు అదనపు నిధులు కోరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై డెమోక్రాటిక్ సెనేటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. యుద్ధాన్ని తీవ్రతరం చేస్తామని, యుద్ధ నేరాలకు పాల్పడతామని ట్రంప్‌ బెదిరిస్తున్నారని సెనేటర్ ప్యాటీ ముర్రే సెనేట్ అప్రోప్రియేషన్స్ కమిటీ విచారణలో తెలిపారు. ఈ కమిటీ సమావేశంలో రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్‌ను నిలదీసిన వారు, ప్రజల అవసరాలను విస్మరించి యుద్ధ ఖర్చులకు అపరిమిత నిధులు కోరడం సమంజసం కాదని పేర్కొన్నారు. సెనేటర్ ప్యాటీ ముర్రే మాట్లాడుతూ, ఇరాన్‌తో ఒప్పందం త్వరలో పూర్తవుతుందని పలుమార్లు చెప్పిన ట్రంప్ ప్రభుత్వం, ఇప్పుడు మరో 70 బిలియన్ డాలర్లు కోరడం ఆమోదయోగ్యం కాదన్నారు. 2027 పెంటగాన్ బడ్జెట్‌గా 1.5 ట్రిలియన్ డాలర్లు కోరడాన్ని సెనేటర్ కిర్‌స్టెన్ గిల్లిబ్రాండ్ తప్పుబట్టారు. రైతులు, ఆరోగ్యం, ఆహారం, ఆశ్రయం వంటి ప్రజా అవసరాలను పక్కనబెట్టి బాంబుల తయారీకి అపరిమిత నిధులు కోరుతున్నారని విమర్శించారు.

ట్రంప్‌కు యుద్ధంపై స్పష్టమైన వ్యూహం లేదా దీర్ఘకాలిక ప్రణాళిక లేదని సెనేటర్ గ్యారీ పీటర్స్ వ్యాఖ్యానించారు. దీనికి ప్రతిస్పందించిన రక్షణ మంత్రి హెగ్‌సెత్, అమెరికా సైన్యానికి అవసరమైన నిధులు ఇవ్వడంలో చట్టసభ సభ్యులే వెనుకంజ వేస్తున్నారని ఆరోపించారు. అయితే ఇది నిధుల సమస్య కాదని, నాయకత్వ వైఫల్యమే అసలు కారణమని పీటర్స్ బదులిచ్చారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్