వాషింగ్టన్ : ఉద్యోగులకు ఒరాకిల్ భారీ షాక్‌నిచ్చింది. ‘‘ మీ ఉద్యోగానికి సంబంధించి ఒక కఠినమైన వార్తను తెలియజేస్తున్నాం. ఇదే మీ చివరి పనిదినం ’’ అంటూ ఉద్యోగులకు సోమవారం ఉదయం 6.00గంటలకు ఈమెయిల్ పంపినట్లు సంబంధిత వర్గాలు పేపర్కొన్నాయి. ఎఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఒరాకిల్ భారీగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో తాజా లేఆఫ్‌లకు సిద్ధమైనట్లు తెలిపాయి. అయితే ఎంతమంది ఉద్యోగులను తొలగించిందన్న అంశంపై సమాచారం లేదు. విస్తృత సంస్థాగత మార్పుల్లో భాగంగా తొలగిస్తున్నట్లుఈ మెయిల్ పేర్కొంది. అయితే ఉద్యోగిని ఎందుకు తొలగిస్తున్నారు అనే అంశంపై వివరణనివ్వలేదు. ఒరాకిల్ కంప్యూటర్లు, ఈమెయిల్, వాయిస్ మెయిల్, ఫైళ్లకు వారి యాక్సెస్ త్వరలో నిలిపివేయనున్నట్లు ఉద్యోగులకు తెలిపారు. పిఎఫ్, ఇతర వివరాల గురించి సమాచారం కోసం వ్యక్తిగత ఈమెయిల్ చిరునామాను పంపాల్సిందిగా ఒరాకిల్ ఉద్యోగులను కోరింది. ఉద్యోగులకు ఈమెయిల్ వచ్చిన కొద్దిసేపికే వారు కంపెనీ సిస్టమ్‌ల యాక్సెస్‌ను కోల్పోవడం గమనార్హం. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో ఒరాకిల్ సుమారు 21,000మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. ఇది ఆ సంస్థ మొత్తం ఉద్యోగుల్లో 13శాతానికి సమానం. అంతకు ముందు సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఒరాకిల్లో సుమారు 1,62,000గా ఉన్న ఉద్యోగుల సంఖ్య మేనాటికి సుమారు 1,41,000కి చేరింది.
‘‘ఇదే మీ లాస్ట్ వర్కింగ్ డే ’’ : ఉద్యోగులకు షాకిచ్చిన ఒరాకిల్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 15, 2026, 11:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)