సోమవారం, 07 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

న్యూ మెక్సికో పేరు మార్చాలన్న ట్రంప్ .. తిరస్కరించిన రాష్ట్ర గవర్నర్‌

17 గంటల క్రితం

Trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 07, 2026, 11:36 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : న్యూ మెక్సికో రాష్ట్రం పేరును ‘న్యూ అమెరికా’గా మార్చాలని ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సూచించారు. పేర్ల మార్పుల పరంపరలో భాగంగా ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. అయితే ఈ ప్రతిపాదనను రాష్ట్ర గవర్నర్‌ మిషెల్‌ లుజాన్‌ గ్రిషమ్‌ తిరస్కరించారు. ‘‘న్యూ మెక్సికో పేరును ‘న్యూ అమెరికా’గా మార్చాలని చాలా మంది సూచించారు. ఇది ఆ రాష్ట్ర ప్రజలకు ఎంతో గౌరవప్రదమైన, అందమైన పేరు అవుతుంది’’ అని ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పేర్కొన్నారు. వైట్‌హౌస్‌ కూడా ‘న్యూ మెక్సికో’లోని ‘మెక్సికో’ స్థానంలో ‘అమెరికా’ అని మార్చిన చిత్రాన్ని పోస్ట్‌ చేసింది. ఈ పేరుమార్పుపై చర్చకు తావులేదని గవర్నర్‌ లుజాన్‌ గ్రిషమ్‌ స్పష్టం చేశారు. అమెరికా ఏర్పడక ముందే న్యూ మెక్సికోకు ఈ పేరు ఉందని ఆమె పేర్కొన్నారు. పెరుగుతున్న గ్యాస్‌ ధరలు వంటి సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ట్రంప్‌ ఇలాంటి ప్రతిపాదనలు చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆలోచన తొలుత ఇంటర్నెట్‌లో ప్రచారమైన ఒక అబద్ధపు ప్రచారం నుంచి పుట్టిందని కొన్ని అమెరికా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఇటీవల కెనడాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ‘లేక్‌ ఒంటారియో’ పేరును ‘లేక్‌ అమెరికా’గా మార్చే ప్రయత్నం చేసిన ట్రంప్‌.. దానికి కెనడా నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్నారు. అలాగే ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న సమయంలో హోర్ముజ్‌ జలసంధికి ‘ట్రంప్‌ జలసంధి’గా పేరు మార్చాలని గత వారం సూచించారు. 2025లో రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే ‘గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో’ పేరును ‘గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా’గా మార్చే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్