శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

చాబహార్‌ ఓడరేవుపై అమెరికా దాడి.. కూలిన టవర్‌

11 గంటల క్రితం

Chabahar Port
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 17, 2026, 03:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టెహ్రాన్‌ : ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవుపై అమెరికా విరుచుకుపడింది. శుక్రవారం అమెరికా జరిపిన వైమానిక దాడుల కారణంగా, ఆప్ఘనిస్థాన్‌కు కీలకమైన వాణిజ్య మార్గంగా ఉన్న గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ తీరంలోని చాబహార్‌ ఓడరేవులోని టవర్‌ కూలిపోయినట్లు హోమ్జగన్‌ యూనివర్శిటీ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సమాచారం ఆధారంగా మీడియా పేర్కొంది. శుక్రవారం తెల్లవారుజాము నుండి అమెరికా దాడులను పెంచిందని, ఇరాన్‌లోని పలు బ్రిడ్జీలపై దాడులు చేపట్టినట్లు యుఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. దక్ష‍ిణ ఓడరేవు నగరమైన బందర్‌ ఖమీర్‌లోని వంతెలనపై జరిపిన దాడుల్లో ఏడుగురు మరణించినుట్ల ఇరాన్‌ మీడియా తెలిపింది. సుమారు 12కి పైగా లక్ష్యాలపై తాజాగా దాడులు జరిపినట్లు పేర్కొంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్