సోమవారం, 03 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్‌పై దాడులు నిలిపివేసిన అమెరికా.. చర్చలకు మరో అవకాశం: ట్రంప్

18 గంటల క్రితం

Trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 09:39 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషిగ్టన్ : కొన్నిరోజులుగా ఇరాన్‌పై చేస్తోన్న భారీ దాడులను ప్రస్తుతానికి అమెరికా నిలిపివేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచి రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభం అవుతాయని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ ప్రకటించారు. తాము ఇరాన్‌పై భీకర దాడులు చేపట్టాలని భావించామని, అవే జరిగి ఉంటే రెండో ప్రపంచయుద్ధం తర్వాత అది పెద్ద దాడిగా మిగిలి ఉండేదని వ్యాఖ్యానించారు. అయితే ఘర్షణల ఆలోచన పక్కన పెట్టి, దౌత్యంవైపే మొగ్గుచూపామని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల విజ్ఞప్తి మేరకు దాడులను నిలిపివేసి, చర్చలకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఘర్షణల కంటే చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై ట్రంప్ సానుకూలంగా స్పందించారు. చర్చల ద్వారా ప్రాణనష్టం, విధ్వంసాన్ని నివారించవచ్చని పేర్కొంటూ దౌత్య మార్గానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్