బుధవారం, 26 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

కృతి సనన్ రక్షాబంధన్ ప్రకటనను తొలగించిన గివా

1 గంట క్రితం

giva
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 26, 2026, 12:46 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇంటర్నెట్ : నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్‌ ప్రకటనపై సోషల్ మీడియాలో పలు విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఆభరణాల బ్రాండ్ గివా ఆ ప్రకటనను ఉపసంహరించుకుంది. బుధవారం సోషల్ మీడియా ద్వారా స్పందించిన గివా.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, పండుగల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని తెలిపింది. తమ ప్రకటన సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను అనుకోకుండా దెబ్బతీసి ఉంటే, అది తమ ఉద్దేశ్యం కాదని గివా స్పష్టం చేసింది. గౌరవ సూచకంగా ప్రకటనను అన్ని మీడియా వేదికల నుంచి తొలగించినట్లు వెల్లడించింది. కుటుంబంతో కలిసి పండుగలను జరుపుకోవడంతో పాటు, పెంపుడు జంతువులతోనూ ప్రేమను పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రకటనను రూపొందించినట్లు గివా పేర్కొంది. పండుగ సీజన్‌లో అందరికీ ప్రేమ, సానుకూలత కలగాలని కోరింది. ఇది ఇలా ఉండగా మరోవైపు ఎవరి నచ్చిన దుస్తులు వారు ధరించవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్