సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

T20: విజేతగా ఆసీస్‌

1 రోజు క్రితం

t20
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 05, 2026, 10:45 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

- టి20 విజేతగా 7వ సారి

లండన్‌: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 17.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 153 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఇంకా 17 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 7వ సారి టి20 విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది.

ఇంగ్లండ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న బెత్ మూనీ 49 బంతుల్లో 64 పరుగులతో జట్టు విజయానికి బలమైన పునాది వేసింది. ఫీబీ లిచ్‌ఫీల్డ్ 35 బంతుల్లో 48 పరుగులు చేసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చివర్లో ఎలిస్ పెర్రీ (13 నాటౌట్), ఆష్లీ గార్డ్నర్ (3 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు.

అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో 150/4 స్కోరు నమోదు చేసింది. ఆస్ట్రేలియా క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయలేకపోయింది.

సంక్షిప్త స్కోర్లు:

  • ఇంగ్లండ్: 150/4 (20 ఓవర్లు)

  • ఆస్ట్రేలియా: 153/3 (17.1 ఓవర్లు)

మహిళల టీ20 ప్రపంచకప్‌ ఆదివారం జరుగుతున్న తుదిపోరులో ఆస్ర్టేలియా ముందు ఇంగ్లాండ్‌ ‌జట్టు 151 విజయలక్ష్యాన్ని నిలిపింది. ఈ మ్యాచ్‌‌లో ముందుగా టాస్‌ ‌గెలిచిన ఆస్ర్టేలియా ఫీల్డింగ్‌ ‌ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 150/4 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌లో ఓపెనర్లు అమీ జోన్స్ (6), డాని వ్యాట్-హాడ్జ్ (8) తీవ్రంగా నిరాశపర్చినా వీరి తరువాత వచ్చిన నాట్‌సీవర్ బ్రంట్ 58 (నాటౌట్‌)- అలీస్ క్యాప్సీ (23) జోడీ జట్టును ఆదుకుంది. క్యాపీ అవుట్‌ ‌తరువాత హెదర్‌ నైట్ (2) విఫలం చెందిన ఫ్రేయా కెంప్ (44) నాటౌట్‌ ‌గా నిలిచింది. ఆస్ట్రేలియా బౌలర్లలో కిమ్‌ గార్త్‌, లూసీ హామిల్టన్‌, సోఫీ, అన్నాబెల్ సదర్లాండ్ తలో వికెట్‌ తీశారు. కాగా, ఈ . టోర్నీలో ఇరు జట్లు ఒక్క మ్యాచూ ఓడకుండా ఫైనల్‌ చేరడం విశేషం. రికార్డు స్థాయిలో ఆరుసార్లు (2010, 2012, 2014, 2018, 2020, 2023) పొట్టి కప్పును చేజిక్కించుకున్న ఆస్ట్రేలియాను అంతా ఫేవరెట్‌గా భావిస్తున్నారు. అయితే 2009 ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను తక్కువగా అంచనా వేసే పరిస్థితి లేదని, సొంతగడ్డపై ఆడుతుండడం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. అయితే 2012, 2014, 2018 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇంగ్లాండ్‌ ఈసారి కూడా ఓటమి పాలైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్