ప్రజాశక్తి - గన్నవరం: సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై గన్నవరం పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. వికలాంగురాలైన కర్నూలుకు చెందిన పార్వతీదేవి స్వయంగా గన్నవరం పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు ఇచ్చారు. పవన్ కల్యాణ్ తనను మోసం చేశారని, నమ్మకద్రోహానికి పాల్పడ్డారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి సంతకం తన కుమార్తె సుగాలి ప్రీతి కేసు ఫైల్‌పైనే పెడతానని ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారని, కానీ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మాట మార్చారని పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని కోరిన ప్రతిసారీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తనపై దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మకద్రోహం, మోసపూరిత హామీలు ఇచ్చినందుకు పవన్ కల్యాణ్‌పైన, తనపై దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. ఈ మేరకు గన్నవరం పోలీసులు ఫిర్యాదును స్వీకరించారు.
పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 07, 2026, 01:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)