సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కల్లోల విలయాలు

1 గంట క్రితం

venezuela
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 07, 2026, 03:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

అర్థం పర్థం లేని యుద్ధం

పసికందులపై రాక్షసత్వం

ఎదుగుదలను చూసి కక్షల పర్వం

అగ్రరాజ్యాల అనైతిక పైశాచికత్వం.

భవనాలపై బాంబుల వర్షం

భీతావహంగా అవనీతలం

నీడ లేక ప్రాణులు సతమతం

ఆకలితో అల్లాడుతున్న జన జీవనం.

విపణిని అలుముకున్న తిమిరం

వాణిజ్య సరుకుల పెను భారం

ప్రజలకు చుక్కలు చూపే వైనం

కుబేరులు కావడానికే ఈ విలయం.

ముగింపు లేని ఇరు వర్గాల వైరం

అవనిని శ్మశాన దిబ్బను చేయడం

అమెరికా, ఇజ్రాయిల్ లు పంజా విసరడం

మనిషిని మనిషి నిలువునా మింగడం.

మరోపక్క ప్రకృతి వైపరీత్యం

వెనుజులాలో భూకంప తాండవం

బహుళ సౌధాలు నేలకూలడం

శిథిలాల కింద పామరులు నలగడం.

విగత జీవులతో అతలా కుతలం

జెడలు విప్పె నృత్య కరాళభూతం

భయం భయంగా నగరాల విలాపం

విశ్వమంతా విషాద వదనం.


- నమిలకొండ నాగేశ్వర్ రావు,

సెల్‌: 8688553470

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్