శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమెటా ఉద్యోగుల కోత ప్లాన్‌కు బ్రేక్

12 గంటల క్రితం

meta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 27, 2026, 10:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

వాషింగ్టన్‌ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (ఎఐ) ఆధారిత కార్యకలాపాల వైపు వేగంగా అడుగులు వేస్తున్న మేటా.. ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించే ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. ‘ప్రాజెక్ట్‌ ఒటి’ పేరుతో చేపట్టిన ఈ పునర్వ్యవస్థీకరణలో కొన్ని విభాగాల్లో 60 శాతం వరకు సిబ్బందిని తగ్గించి, వారి స్థానంలో ఎఐ ఏజెంట్లను వినియోగించాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా యాజమాన్యం వెనక్కి తగ్గిందని రిపోర్టులు వస్తున్నాయి. ఎఐ ఏజెంట్ల ద్వారా రోజువారీ కార్యకలాపాలను నిర్వహిస్తూ, పరిమిత సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులతో వాటిని పర్యవేక్షించాలని మేటా తొలుత భావించింది. ఈ రీస్ట్రక్చరింగ్‌ను రెండు దశల్లో చేపట్టాలని యోచించినప్పటికీ, రెండో దశలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సంబంధించిన ప్రతిపాదనను నిలిపివేసింది. ఎఐ వ్యవస్థలు ఆశించిన స్థాయిలో ఉత్పాదకతను అందించకపోవడం, ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం కావడం వంటి అంశాలు ఈ నిర్ణయానికి కారణాలుగా తెలుస్తోంది. ఎఐపై భారీ పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో వాటి నుంచి ఆశించిన ప్రయోజనాలు ఎంత మేరకు వస్తున్నాయన్న దానిపై ఇటీవల పెట్టుబ డిదారుల పరిశీలన కూడా పెరుగు తోంది. దీంతో ఎఐ విస్తరణతో పాటు మానవ వనరుల అవసరాల మధ్య సమతుల్యత సాధించడం మేటాకు కీలక సవాలుగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్