బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionయుపిఐపై ఛార్జీలు వాయిదా..

7 గంటల క్రితం

యుపిఐపై ఛార్జీలు వాయిదా..
తాత్కాలికంగా వెనక్కి తగ్గిన ఎన్‌పిసిఐ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 12:32 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తాత్కాలికంగా వెనక్కి తగ్గిన ఎన్‌పిసిఐ

న్యూఢిల్లీ : పండగల సీజన్‌కు తోడు దేశంలో జెన్‌జీ ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలో యుపిఐ లావాదేవీలపై ఛార్జీల అమలును కేంద్రం వాయిదా వేసుకుంది. యుపిఐ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ (ఎండిఆర్‌) ఛార్జీలను ఈ గురువారం నుంచి అమలు చేయాలన్న ప్రతిపాద నను నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా దీపావళి తర్వాతకు వాయిదా వేసింది. పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకు న్నట్లు మంగళవారం ప్రకటించింది. కొత్త అమలు తేదీని ఇంకా వెల్లడించలేదు. ఎండిఆర్‌ ఛార్జీలు అమల్లోకి వస్తే వ్యాపారులపై అదనపు వ్యయభారం పడే అవకాశం ఉంది. ఆ భారాన్ని వ్యాపారులు వినియోగదారులకు బదిలీ చేస్తే డిజిటల్‌ చెల్లింపుల ఖర్చు పెరుగుతుందనే ఆందోళనలు పెరిగాయి. ఇప్పటికే ధరల పెరుగుదల, జీవన వ్యయంపై ప్రజల్లో అసంతృప్తి ఉన్న సమయంలో పండగల కొనుగోళ్ల వేళ కొత్త ఛార్జీలు అమలు చేస్తే వారి నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎండిఆర్‌ అమలును వాయిదా వేయడం వెనుక వ్యతిరేకతపై ఆందోళనలు కూడా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తోన్నారు. యుపిఐ స్టీరింగ్‌ కమిటీ సమావేశంలో పండగల సీజన్‌తో పాటు అమలుకు సంబంధించిన సవాళ్లపై చర్చించినట్లు ఎన్‌పిసిఐ తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్