బుధవారం, 22 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition వంటనూనెల దిగుమతి బిల్లు 9 శాతం పెరగొచ్చు : ఎస్‌ఇఎ

4 గంటల క్రితం

edible-oil-prices
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 09:26 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశంలో వంటనూనెల దిగుమతి బిల్లు ఈ ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం (నవంబర్‌ ‌నుంచి అక్టోబర్‌ ) ‌కాలంలో 9 శాతం పెరిగి రికార్డు స్థాయిలో రూ. 1.75 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఇఎ) అంచనా వేసింది. దిగుమతి పరిమాణం పెరగడం, రూపాయి మారకం విలువ పడిపోవడం వంటి కారణాల వల్ల గత ఏడాది రూ.1.61 లక్షలుగా ఉన్న ఈ బిల్లు భారీగా పెరుగుతోందని ఎస్‌ఇఎ అధ్యక్షుడు సంజీవ్ అస్థానా తెలిపారు. నవంబర్ 2025 నుంచి జూన్ 2026 మధ్య కాలంలో దిగుమతులు 103.88 లక్షల టన్నులకు (గత ఏడాది ఇదే కాలంలో 97.29 లక్షల టన్నులు) చేరాయని, వాతావరణ అనిశ్చితి పరిస్థితులు, రుతుపవనాల్లో అలస్యంతో పాటు ఇండోనేషియా బయోడీజిల్ కార్యక్రమం వల్ల అంతర్జాతీయంగా పామాయిల్ సరఫరా తగ్గి ధరలు పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశీయంగా నూనెగింజల ఉత్పత్తిని పెంచడం ద్వారానే విదేశీ మారకద్రవ్య ప్రవాహాన్ని అరికట్టవచ్చని, ఖరీఫ్ సీజన్ సాగుపై తదుపరి వర్షపాతం ఎక్కువగా ప్రభావం చూపే అవకాశముందన్నారు. .


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్