బుధవారం, 21 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎస్‌బిఐపై సైబర్ దాడి..

4 గంటల క్రితం

ఎస్‌బిఐపై సైబర్ దాడి.. 
3,897 మంది ఖాతాలు ‌హ్యాక్‌ image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026, 09:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- 3,897 మంది ఖాతాలు ‌హ్యాక్‌

ముంబయి : దేశీయ బ్యాంకింగ్‌ ‌దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌‌బిఐ)పై జరిగిన సైబర్ దాడిలో 3,897 మంది వినియోగదారుల బ్యాంకు ఖాతాలు హ్యాక్ అయ్యాయి. వారి పేర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీ, చిరునామాలు, మెయిల్ ఐడిలతో కూడిన రికార్డులన్నీ డార్క్‌వెబ్‌లోకి వెళ్లాయని డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ అండ్ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్‌-ఐఎన్‌) హెచ్చరికల ద్వారా ‌వెల్లడయ్యింది. అయితే ఈ ఘటన వల్ల బ్యాంకు ఆర్థిక లావాదేవీలపై ఎలాంటి పెద్ద ప్రభావం ఉండదని, వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఎస్‌‌బిఐ స్పష్టం చేసింది. నష్ట తీవ్రతను అంచనా వేయడానికి, భద్రతను నిర్ధారించడానికి ప్రస్తుతం సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, దర్యాప్తు ముగిసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్