గురువారం, 10 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పైలట్లందరికీ డ్రగ్ టెస్ట్ : డిజిసిఎ ఆదేశం

55 నిమిషాల క్రితం

drugs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 10, 2026, 09:59 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ఎయిరిండియా విమానంలో జరిగిన ఒక ఘటన నేపథ్యంలో డైరెక్టరేట్‌ ‌జనరల్‌ ‌సివిల్‌ ఏవియేషన్‌ (‌డిజిసిఎ) అన్ని విమాన సంస్థల పైలట్లకు వచ్చే ఏడాది జులై నాటికి ఒకేసారి డ్రగ్ టెస్ట్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఫుకెట్ నుంచి భారత్‌కు వచ్చిన ఎయిరిండియా ఎయిర్‌బస్ ఎ320 విమానం మూడు హైడ్రాలిక్ సిస్టమ్స్‌ విఫలమై గాలిలో సుమారు 300 అడుగులు పడిపోయిన ఘటన తర్వాత, ల్యాండింగ్ అనంతరం నిర్వహించిన పరీక్షలో కెప్టెన్ చట్టవిరుద్ధమైన డ్రగ్స్ సేవించినట్లు తేలడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ డ్రగ్స్ వాడకానికి, విమాన లోపానికి సంబంధం ఉందనేది ఇంకా నిరూపితం కానప్పటికీ, ఇది తీవ్రమైన ఆందోళనకర అంశమని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పేర్కొంది. ఈ నేపథ్యంలో పైలట్ల డ్రగ్ టెస్ట్ నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు డిజిసిఎ కసరత్తు చేస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనికి సంబంధించిన ముసాయిదా నిబంధనలు ఈ నెల చివరి నాటికి ఖరారు కానున్నాయన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్