శుక్రవారం, 28 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఇ20తో పాటూ ఇ10 : బిపిసిఎల్‌ చైర్మన్‌

11 గంటల క్రితం

sanjay khanna
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 12:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రస్తుతమున్న ఇ20 పెట్రోల్‌ (20శాతం ఇథనాల్‌) ‌తో పాటూ ఇ10 పెట్రోల్‌ (10‌శాతం ఇథనాల్‌)‌ను కూడా ప్రజలకు అందించే అవకాశాలను ప్రభుత్వం, చమురు కంపెనీలు అన్వేషిస్తున్నాయని దేశంలోనే రెండవ అతిపెద్ద ఇంధన రిటైలర్‌ ‌భారత్‌ ‌పెట్రోలియం (బిపిసిఎల్‌) ‌చైర్మన్‌ ‌సంజయ్‌ ‌ఖన్నా గురువారం విలేకర్లకు తెలిపారు. అధికంగా ఇథనాల్‌ ‌కలిపే పెట్రోల్‌‌తో నడిచేలా పాత వాహనాలు రూపొందించనందున వాటి కోసం ఇ 10ను కూడా అందించాలని యోచిస్తున్నారు. అయితే ఆ ఇంధన సరఫరా ప్రక్రియలోనూ, మౌలిక వసతులకు సంబంధించిన సవాళ్లు అనేకం వున్నందున ఇంకా తుది నిర్ణయమైతే తీసుకోలేదు. షెడ్యూల్‌‌కు ముందుగానే 20శాతం ఇథనాల్‌ ‌బ్లెండింగ్‌ ‌లక్ష్యాన్ని భారత్‌ ‌సాధించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్