వర్ధమాన, పేద దేశాలకు ఐఎంఎఫ్ నీతులు
బ్యాంకాక్ : ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో ఇంధన సంక్షోభం నెలకొందని, ఈ పరిస్థితుల్లో వర్ధమాన దేశాలు, పేద దేశాలు తమ ఖర్చులను తగ్గించుకోవడం, రుణాలు రీషెడ్యూల్ చేసుకోవడం మినహా 'మరో మార్గం లేదు' అని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నీతులు వల్లె వేసింది. బ్యాంకాక్లో ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల సందర్భంగా ఆ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ (రీసెర్చ్) పెట్యా కోవా బ్రూక్స్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. అధిక మొత్తంలో రుణాలున్న దేశాలపైనా, చమురు దిగుమతి దేశాలపైనా ఇంధన సంక్షోభం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు తెలిపారు. గత కొన్నేళ్ల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వరుసగా దిగ్ర్భాంతికర పరిణామాలను చవిచూస్తోందని, దేశాల రుణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయని తెలిపారు. అదే ఆయా దేశాల ద్రవ్యోల్బణం కూడా పెను సమస్యగా మారిందని చెప్పారు.








కామెంట్లు (0)