ఆదివారం, 15 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

19 గంటల క్రితం

బంగారం ధరకు రెక్కలు.. 
ఒక్కరోజే రూ.3,200 పెరుగుదల image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026, 09:48 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.1,37,340

ప్రజాశక్తి – విజయవాడ : బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు నేడు కాస్త దిగివచ్చాయి. హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,37,340గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,890గా నమోదైంది. వరంగల్‌, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

ఇతర నగరాలతో పోలిస్తే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,480గా, ఢిల్లీలో రూ.1,37,490గా ఉంది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్‌, విజయవాడ మార్కెట్లలో కిలో వెండి ధర రూ.1,94,900గా నమోదైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్