శుక్రవారం, 02 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionజిఎస్‌‌టి వసూళ్లు 15 శాతం వృద్ధి

7 గంటల క్రితం

జిఎస్‌‌టి వసూళ్లు 15 శాతం వృద్ధి
సెప్టెంబర్‌‌లో రూ.2 లక్షల కోట్లు వసూలు image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 01, 2026, 09:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • సెప్టెంబర్‌‌లో రూ.2 లక్షల కోట్లు వసూలు

న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా వస్తు సేవల పన్ను (జిఎస్‌‌టి) వసూళ్లు వరుసగా మూడో నెలలోనూ రూ.2 లక్షల కోట్లు పైగా నమోదయ్యాయి. గడిచిన నెలలో స్థూల జిఎస్‌‌టి వసూళ్లు గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 14.7 శాతం పెరిగి రూ.2,03,521 కోట్లకు చేరాయి. కేంద్ర జిఎస్‌‌టి కింద రూ.37,762 కోట్లు, రాష్ట్ర జిఎస్‌‌టి కింద రూ.45,363 కోట్లు, ఐజిఎస్‌‌టి కింద రూ.1,20,396 కోట్లు చొప్పున వసూలయ్యాయి. నికర జిఎస్‌‌టి ఆదాయం 18.1 శాతం పెరిగి రూ.1,76,520 కోట్లకు చేరింది. 2026-27 ఏప్రిల్‌–సెప్టెంబర్‌ మధ్య తొలి ఆరు నెలల్లో స్థూల జిఎస్‌‌టి వసూళ్లు 11.6 శాతం పెరిగి రూ.12,46,278 కోట్లుగా చోటు చేసుకున్నాయి. గడిచిన నెలలో దిగుమతులపై జిఎస్‌‌టి ఆదాయం 29 శాతం పెరిగి రూ.62,604 కోట్లకు చేరగా, దేశీయ జిఎస్‌‌టి వసూళ్లు 9.3 శాతం వృద్ధితో రూ.1,37,249 కోట్లుగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో జిఎస్‌‌టి వసూళ్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్‌ నెలలో 6 శాతం పెరుగుదలతో రూ.3,599 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. తెలంగాణలో 18 శాతం వృద్ధితో రూ.5,327 కోట్ల జిఎస్‌‌టి రెవెన్యూ నమోదయ్యింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్