శనివారం, 24 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒకే వ్యక్తి రెండు పార్టీల పేరుతో నామినేషన్లు

2 గంటల క్రితం

Same person files nominations under the names of two different parties
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 24, 2026, 01:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తూరు మామిడి కాశీపట్నం లో అభ్యంతరాలు. అనర్హులుగా ప్రకటించాలని ఆర్ ఓ కు ఫిర్యాదులు


ప్రజాశక్తి-మక్కువ (మన్యం) : మన్యం మండలంలోని తూరుమామిడి, కాశీపట్నం ఎంపిటిసి స్థానాలకు సంబంధించి ఇద్దరు వ్యక్తులు రెండు పార్టీల తరఫున నామినేషన్ వేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తూరుమామిడి టిడిపి అభ్యర్థి మత్సరవీణ, కాశీపట్నం టిడిపి అభ్యర్థి కోట శంకర్ నాయుడు శనివారం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కాశీపట్నం ఎంపిటిసి స్థానం నుండి చందాన అప్పల ఆజయకుమార్ బీఎస్పీ, జనసేన పార్టీ తరఫున వేరువేరు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే తూరుమామిడి ఎంపిటిసి స్థానం నుండి చంగలి గౌరమ్మ బీఎస్పీ, టిడిపి తరుపున రెండు నామినేషన్లు దాఖలు చేశారని ఆరో కు ఫిర్యాదులు చేశారు. దీంతో ఆర్ ఓ జి శ్రీనివాసరావు ఆ ఫిర్యాదును పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్