- చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ పునరుద్దరణ
న్యూఢిల్లీ : కరోనా తర్వాత తూర్పు లడక్ సరిహద్దు వివాదాల కారణంగా గత ఆరేళ్లుగా నిలిచిపోయిన గ్వాంగ్‌జౌ-న్యూఢిల్లీ విమాన సర్వీసులను సెప్టెంబర్ 21 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ శనివారం ప్రకటించింది. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ ఈ కీలక నిర్ణయం వెలువడింది. భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితిలోకి తీసుకొచ్చే అంశంలో భాగంగా ఈ సర్వీసులు పునరుద్ధరిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది. దక్షిణాసియాలో ఎనిమిది రౌండ్-ట్రిప్ రూట్లలో వారానికి 100కి పైగా విమానాలను నడుపుతున్నామని, ఈ సర్వీసుల పునరుద్ధరణ ఇరు దేశాల మధ్య ప్రయాణ, వ్యాపార సంబంధాలను మరింత మెరుగుపరుస్తుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)