ప్రజాశక్తి - హైదరాబాద్ : అంతర్జాతీయ హై-స్ట్రీట్ ఫ్యాషన్ బ్రాండ్ ‘కెల్లీ ఫెల్డర్’ హైదరాబాద్‌లో తన తొలి స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా అధికారికంగా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. కొలంబో, మెల్‌బోర్న్ తర్వాత గ్లోబల్ విస్తరణలో భాగంగా భారత్‌లో తొలి నగరంగా హైదరాబాద్‌ను ఎంచుకున్నట్లు సంస్థ వెల్లడించింది. నగరంలో ఘనంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకకు నటి నేహా శర్మ ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ స్టోర్‌లో మహిళా, పురుషుల దుస్తులతో పాటు పెర్ఫార్మెన్స్‌వేర్, యాక్సెసరీస్ వంటి వైవిధ్యమైన కలెక్షన్లను ఒకే చోట అందుబాటులో ఉంచామని, స్థానిక మార్కెట్ స్పందనను బట్టి భవిష్యత్తులో దేశంలోని ఇతర నగరాలకు కార్యకలాపాలను విస్తరించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
హైదరాబాద్‌లోకి "కెల్లీ ఫెల్డర్"
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 23, 2026, 09:54 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)