సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒకే రోజు కెవిబి16 కొత్త శాఖల ప్రారంభం

2 గంటల క్రితం

kvb
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- తెలంగాణలో 68కి చేరిన నెట్‌వర్క్

ప్రజాశక్తి - హైదరాబాద్‌ : ప్రయివేటు రంగంలోని కరూర్ వైశ్య బ్యాంక్ (కెవిబి) దేశవ్యాప్తంగా ఒకే రోజు 16 కొత్త శాఖలను ప్రారంభించి తన నెట్‌వర్క్‌ను 919కి విస్తరించింది. తమిళనాడులో 6, ఆంధ్రప్రదేశ్‌లో 5, తెలంగాణలో 3, కర్ణాటక, ఢిల్లీ ఎన్సీఆర్‌లలో ఒక్కో శాఖ చొప్పున తెరిచింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి శాఖను కెవిబి ఎండి, సిఇఒ రమేష్ బాబు ప్రత్యక్షంగా ప్రారంభించారు. ఈ విస్తరణతో తెలంగాణలో కెవిబి నెట్‌వర్క్ సంఖ్య 68కి చేరిందని రమేష్ బాబు తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ, ఎంఎస్‌ఎంఈ, రిటైల్, వ్యవసాయ రంగానికి చెందిన కస్టమర్ల కోసం భౌతిక శాఖలు ఇప్పటికీ ఎంతో కీలకమని పేర్కొన్నారు. 2026 జూన్ 30 నాటికి మొత్తం వ్యాపారం రూ. 2,27,267 కోట్లకు చేరిందని, తొలి త్రైమాసికంలో రూ. 756 కోట్ల నికర లాభాన్ని ఆర్జించామని తెలిపారు. కస్టమర్ల కోసం ‘కెవిబి డిలైట్‌’ యాప్ ద్వారా 150కి పైగా డిజిటల్ సేవలను అందిస్తున్నట్లు ఆయన వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్