సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫీచర్‌ ఫోన్‌‌తోనూ యుపిఐ చెల్లింపులు

2 గంటల క్రితం

upi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 08:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- ఫోన్‌పే వెల్లడి

న్యూఢిల్లీ : ఫీచర్ ఫోన్ వినియోగదారులు డిజిటల్‌ ‌చెల్లింపులు చేసేలా ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ ఫోన్‌పే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటర్నెట్‌తో సంబంధం లేకుండా డిజిటల్ చెల్లింపులు చేసేందుకు వీలుగా ‘యుపిఐ123పే’ సర్వీస్‌ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. దీని ద్వారా దేశంలోని 20 కోట్ల మంది పైగా ఫీచర్ ఫోన్ యూజర్లకు డిజిటల్ పేమెంట్స్ చేసే అవకాశం లభించనుందని ఆ సంస్థ వెల్లడించింది. 2జి కనెక్టివిటీ ప్రాంతాల్లోనూ లావాదేవీల కోసం ఎస్‌ఎంఎస్ ఆధారిత వ్యవస్థను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. ఈ సర్వీస్ విస్తరణ కోసం నోకియా, హెచ్‌ఎండి, లావా, ఐటెల్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని ఫోన్‌పే సిఇఒ సమీర్ నిగమ్ పేర్కొన్నారు. ఫోన్ కొనుగోలు చేసినప్పుడే ఈ ఫీచర్‌ ప్రీ బండిల్డ్‌గా వస్తుందన్నారు. ఈ సేవ ద్వారా వ్యక్తులు, వ్యాపారులకు చెల్లింపులు చేయడంతో పాటు బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చన్నారు. కెమెరా ఫీచర్ ఫోన్లతో స్కాన్ చేసి పేమెంట్లు చేయవచ్చని తెలిపారు. మొదటిసారి వాడేవారి కోసం 12 భారతీయ భాషల్లో సహాయం అందించే ప్రత్యేక ఎఐ హెల్ప్‌లైన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. డిజిటల్ చెల్లింపులను దేశంలోని ప్రతి మూలకు విస్తరించే ఉద్దేశంతోనే దీనిని తీసుకొచ్చామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్