ముంబయి : ప్రభుత్వ రంగ దిగ్గజ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసి) 2026 సెప్టెంబర్ 1 నాటికి తన 70 వసంతాలను పూర్తి చేసుకుని ఘనంగా వజ్రోత్సవాలు జరుపుకుంటోందని ఆ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి జీవిత బీమాను చేరువ చేయాలనే ఉద్దేశంతో 1956 సెప్టెంబర్ 1న ఏర్పాటైన ఎల్ఐసి.. నాటి నుంచి ప్రజల నమ్మకం, ఆర్థిక భద్రతకు మారుపేరుగా నిలుస్తూ అద్భుతమైన ప్రస్థానాన్ని సాగిస్తోందని ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రయివేటు కంపెనీల పోటీ ఎదురవుతున్నప్పటికీ మార్కెట్లో ఎల్ఐసి తన గుత్తాధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పాలసీల పరంగా 65.16 శాతం.. మొదటి సంవత్సరం ప్రీమియం ఆదాయం పరంగా 56.66 శాతం మార్కెట్ వాటాను సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక సంస్థ మొత్తం నిర్వహణ ఆస్తులు (ఎయుఎం) 5.08 శాతం పెరిగి రూ. 57.29 లక్ష కోట్ల మైలురాయిని తాకాయి. మే 2022లో చేపట్టిన ఐపిఒ ద్వారా స్టాక్ మార్కెట్లలో ఎన్ఎస్ఇ, బిఎస్ఈలలో లిస్ట్ అయిన ఎల్ఐసి.. కార్పొరేట్ పాలన, పారదర్శకత, డిజిటల్ సేవలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. సామాజిక బాధ్యతలో భాగంగా 2006లో ఏర్పాటు చేసిన ఎల్ఐసి గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ (జిజెఎఫ్) ద్వారా దేశవ్యాప్తంగా 1,045 ప్రాజెక్టులకు రూ.303 కోట్లను వెచ్చించింది. అదే విధంగా పేద విద్యార్థుల కోసం 41,776 ఉపకార వేతనాల కింద రూ. 105.27 కోట్లను అందించింది. ‘మై ఎల్ఐసి’ యాప్ వంటి నూతన డిజిటల్ వేదికల ద్వారా ఖాతాదారులకు మరింత సులభంగా, వేగంగా సేవలను అందిస్తోంది. భవిష్యత్తులోనూ మరింత మెరుగైన సేవలను అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.
ఘనంగా ఎల్‌ఐసి వజ్రోత్సవాలు
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 31, 2026, 08:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)