గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అడిడాస్‌లో ఉద్యోగ కోతలు..

5 గంటల క్రితం

lay off
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 08:47 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- గురుగ్రామ్ కార్యాలయంలో 50 శాతం సిబ్బందిపై ప్రభావం

గురుగ్రామ్: ప్రముఖ స్పోర్ట్స్‌వేర్ సంస్థ అడిడాస్‌ గురుగ్రామ్ కార్యాలయంలో ఉద్యోగ కోతలు చేపడుతున్నట్లు సమాచారం. కార్యాలయంలోని సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. 30 మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రభావితమయ్యే వారిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, డేటా ఇంజినీర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్‌లోని టెక్ విభాగంలో ఉద్యోగాల సంఖ్యను తగ్గిస్తున్నట్లు అడిడాస్ ధృవీకరించినప్పటికీ, ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారనే దానిపై కంపెనీ స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను రెండు దశలుగా చేపట్టినట్లు సమాచారం. మొదటి దశలోని ఉద్యోగులకు మంగళవారం తొలగింపు నోటీసులు అందినట్లు తెలుస్తోంది. రెండో దశలో ఉన్న కొంతమంది ఉద్యోగులను డిసెంబర్ 15 వరకు కొనసాగించాలని కోరినట్లు సమాచారం. ఇదే సమయంలో సంస్థలోని ఇతర విభాగాల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు కొందరు ఉద్యోగులను బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు కోల్పోయే వారికి సెవరెన్స్‌ బెనిఫిట్స్, నోటీసు పీరియడ్‌ వేతనాలు అందించారా లేదా అనే విషయంపై ప్రస్తుతం స్పష్టత లేదు. మారుతున్న టెక్నాలజీ రంగానికి అనుగుణంగా సంస్థ నిర్మాణాన్ని సరళీకృతం చేయడంలో భాగంగానే ఈ ఉద్యోగ కోతలు చేపడుతున్నట్లు అడిడాస్‌ పేర్కొంది. గురుగ్రామ్‌లోని కార్యాలయంలో ఈ పునర్వ్యవస్థీకరణ చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్