శుక్రవారం, 17 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

దిగ్గజ క్రికెటర్‌ గ్యారీ సోబర్స్‌ కన్నుమూత

1 గంట క్రితం

passed away
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 01:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

బార్బడోస్‌ : వెస్టిండీస్ క్రికెట్‌ దిగ్గజం, ఆల్‌టైమ్ గ్రేట్‌ ఆల్‌రౌండర్‌ గ్యారీ సోబర్స్‌ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 89 ఏళ్లు. మరో 10 రోజుల్లో 90వ పుట్టిన రోజు చేసుకుంటారనగా బార్బడోస్‌లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గొప్ప ఆల్‌రౌండర్‌గా, సహజసిద్ధ క్రికెటర్‌గా పేరుగాంచిన గ్యారీ సోబర్స్‌ మరణం అభిమానుల్ని కలిచివేస్తోంది. ' ఓ గొప్ప ఇన్నింగ్స్‌ ముగిసింది. సర్‌ గ్యారీ సోబర్స్‌ మన హృదయాల్లో ఇప్పటికీ, ఎప్పటికీ ఉంటారు' అని క్రికెట్‌ వెస్టిండీస్‌ బోర్డు 'ఎక్స్‌' ఖాతాలో పోస్టు చేసింది.

క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్-రౌండర్లలో ఒకరైన సోబర్స్ 1936 జూలై 28న బార్బడోస్‌లో జన్మించారు. ఐదేళ్ల వయస్సులో తండ్రి మృతి చెందడంతో తల్లి కష్టపడి పెంచారు. 16 ఏళ్లకే ఫస్ట్‌ ‌క్లాస్‌‌లో ప్రవేశించి తరువాత ఏడాదికే జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. 1954 నుండి 1974 మధ్యకాలంలో 93 టెస్టులు ఆడిన సోబర్స్‌ 57.78 సగటుతో 8,032 పరుగులు సాధించారు. ఇందులో 26 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 235 వికెట్లు పడగొట్టాడు. సోబర్స్ ఒకే ఒక్క వన్డే ఆడి ఒక వికెట్ తీసుకున్నాడు. 1968లో ఫస్ట్‌ ‌క్లాస్‌ ‌క్రికెట్‌‌లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌‌లు కొట్టి ఈ రికార్డు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్