సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫిన్‌టెక్ రంగంలోకి ఎల్‌ఐసి..!

2 రోజుల క్రితం

lic
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 09:53 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- హెల్త్ ఇన్సూరెన్స్‌ పైనా దృష్టి

- వ్యూహాత్మక పెట్టుబడులపై కసరత్తు

- ఆ సంస్థ ఎండి ఆర్‌. దొరైస్వామి వెల్లడి

ముంబయి : ప్రభుత్వ రంగ దిగ్గజ సంస్థ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ ‌కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) తన డిజిటల్ సేవలను మరింత ఆధునీకరించడంతో పాటు వ్యాపారాభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఫిన్‌టెక్, హెల్త్ ఇన్సూరెన్స్ రంగాల్లోకి అడుగుపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా డిజిటల్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసుకోవడంతో పాటు ఇన్సూర్‌టెక్ భాగస్వామ్యాల ద్వారా సరికొత్త ఆవిష్కరణలు తీసుకురావడమే తమ ప్రాథమిక లక్ష్యమని ఎల్‌ఐసి మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ ఆర్. దొరైస్వామి వెల్లడించారు. ఖాతాదారులకు అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించేందుకు స్వయంగా ఒక ఫిన్‌టెక్ విభాగాన్ని ఏర్పాటు చేయడం లేదా ఈ రంగంలో ఉన్న నిపుణులైన ఫిన్‌టెక్ కంపెనీల్లో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడం వంటి ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు దొరైస్వామి తెలిపారు. ఎల్‌ఐసి ఇప్పటికే తన సొంత ఐటి బృందం ద్వారా కీలక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లను నిర్వహిస్తున్నప్పటికీ, మార్కెట్‌లో వేగంగా వస్తున్న మార్పులను అందుకోవడానికి, పోటీలో ముందుండటానికి థర్డ్ పార్టీ ఐటి సర్వీస్ ప్రొవైడర్లు, ఫిన్‌టెక్ సంస్థలతో భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు తమ ఐటి వ్యవస్థను మరింత వేగవంతం చేయడమే కాకుండా, పాలసీదారుల నిధులకు మెరుగైన రాబడిని అందించడానికి దోహదపడతాయని ఆయన వివరించారు. దీనికితోడు దేశంలో వేగంగా విస్తరిస్తున్న ఆరోగ్య బీమా విభాగంలోకి ప్రవేశించేందుకు కూడా ఎల్‌ఐసి సమాయత్తమవుతోందన్నారు. ఇందులో భాగంగా స్వతంత్ర హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలలో వాటాలను కొనుగోలు చేసే అవకాశాలను సంస్థ పరిశీలిస్తోందన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్